అలాగే జర్నలిస్టులను చిన్న పత్రికల విలేకరులు, పెద్ద పత్రికల విలేకరులు, చిన్న విలేకరులు, పెద్ద విలేఖరులు, అనే బేధాలు సృష్టించి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, పత్రికల యాజమాన్యాలు పాత్రికేయ వృత్తి ఎంచుకున్న వారిపై అనేక ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం?
సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్న, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయ భవన సముదాయం, జిల్లా టిఆర్ఎస్ కార్యాలయం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పత్రిక విలయకారులను ఆహ్వానించకపోవడం దారుణం. అన్యాయం, అవసరం ఉన్న పనులకు జర్నలిస్టులను ఉపయోగించుకొని కరివేపాకులా చేసే పారేయడం లాంటి విధానం సరి అయినది కాదు. తమ ఉపన్యాసాలను ప్రజలకు తెలియపరచడానికి బహిరంగ సభలకు మాత్రమే విలేకరులను అది కూడా వారికి నచ్చిన వారిని మాత్రమే
ఆహ్వానించడం సరైన చర్య కాదు, నూతన కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీడియాకు ప్రవేశం లేదు.
మెదక్ బహిరంగ సభకే మీడియాకు అనుమతి!
కల్వకుంట్ల చంద్రశేఖర రావు
మెదక్ పట్టణంలో నిర్మించిన నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనుటకు వస్తున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నూతన కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీడియాకు ప్రవేశం లేదు. బహిరంగ సభను ప్రెస్ కవరేజి చేయుటకు గాను మెదక్ శాసనసభ్యుల వారు పాసులను అందజేస్తారు. దయచేసి పాసుల కొరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించవలసినదిగా మీడియా మిత్రులకు డి పి ఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. అంటే పాస్ లు కూడా అందరికీ ఇవ్వకుండా తమకు అనుకూలమైన వారికే ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు.
పత్రికలు : నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర అత్యంత కీలకము. ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపాల్సిందే. అలాగని ప్రజల్లో భయాందోళనలను సృష్టించడం కాదు. మొదట దేశ అభిమానం, తెలుగు భాష ఉద్యమం మొదలైన ఉద్యమాల గురించి ఏర్పడ్డాయి. వార్తలను ఇతర సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించే వారే పాత్రికేయులు. వీళ్లు సామాన్య విషయాలపై పనిచేయవచ్చు ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చేయవచ్చు. ఎన్నో రంగాలలో కూడా పాత్రికేయులు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడం వేరు వృత్తిలో ఒక భాగం. కందుకూరి వీరేశలింగం ముట్నూరి కృష్ణారావు గాడిచర్ల హరిసర్వోత్తమరావు కాశీనాథున నాగేశ్వరరావు గిడుగు రామమూర్తి సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారు ఎందరో పాత్రికేయ వృత్తిలో ఆరితేరిన వారు. ఎంతోమంది బహిరంగ ' పాత్రికేయులు ఉద్యోగ నిర్వహణలో తమ ప్రాణాలను సైతం బలి చేశారు. పత్రికల లో దిన వార పక్ష మాస ద్వైమాసిక త్రైమాసిక అర్ధ వార్షిక వార్షిక పత్రికలు ఉంటాయి. ఎక్కువ సర్కులేషన్ ఉన్న పత్రికలు తక్కువ సర్కులేషన్ ఉన్న పత్రికలు ఉంటాయి. ఎలా
ఉన్నప్పటికీ కూడా విలేకరులు ఏ పత్రికకైనా సమాచార సేకరణ చేయవలసి ఉంటుంది. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలి.
చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరూ పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించాలి అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి! అక్రిడేషన్ నిమిత్తం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి! సాధ్యమైనంతవరకు పాత్రికేయుల ఆర్థిక పరిపుష్టికి అటు
ప్రభుత్వం ఇటు అధికారులు నాయకులు కృషి చేయాలి! పాత్రికేయిల లో విభేదాలు కూడదుఏ కుటుంబంలో అయినా సంస్థలో అయినా
సమాజంలో అయినా చిన్న పెద్ద బేధాలు ఉంటూనే ఉంటాయి. కానీ పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో ఈ భేదాలు ఉండడం సమంజసం కాదు. సీనియర్ జర్నలిస్టులు ఉన్నట్లయితే జూనియర్లను కలుపుకొని వెళ్లాలి. చిన్న విలేకరులు పెద్ద విలేకరులు అనే భేదాలు సృష్టించవద్దు. చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే భేదాలు కూడా వద్దు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ అ కార్యక్రమాలకు పాత్రికేయులను విధి గా ఆహ్వానించాలి. తమకు అనుకోని ఆహ్వానించడం, సీనియర్లను లేదా నచ్చిన వాళ్లను ఆహ్వానించడం సరైన విధానం కాదు. చిన్న పెద్ద కలుపుకొని పాత్రికేయులందరినీ ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదక్ సంఘటనలో పాత్రికేయుల పట్ల చూపిన వివక్ష సరి అయినది కాదు. ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు సభకు పిలువకపోవడం మాత్రమే ఆహ్వానించడం పాత్రికేయులు ఆలోచించాల్సిందే సమావేశాలను బహిష్కరించాల్సిందే!
సీనియర్ జర్నలిస్ట్ వెంకటాయోగి రఘురామ్.
0 కామెంట్‌లు