పాలు అమ్మినా!!!!
రూటు మార్చిన మల్లారెడ్డి.
సిల్వర్ స్క్రీన్పై సత్తాచాటే ప్రయత్నం సినిమా రంగంలోకి ఎంట్రీకి ముహూర్తం ఖరారు? సినీ దర్శకులు, స్క్రిప్ట్ రైటర్లతో చర్చలు!
మంత్రి మల్లారెడ్డి... తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. హాస్య చతురతతో ఆయన వేసే పంచ్ డైలాగులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి మల్లారెడ్డి త్వరలోనే మరో బిగ్ డిసిషన్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపై సిల్వర్ స్క్రీన్ పై సత్తాచాటేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని ఇదివరకే ప్రకటించిన మల్లారెడ్డి త్వరలోనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు. చేసి.. తెలంగాణ స్లాంగ్లో సినిమాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు.. ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు, స్క్రిప్ట్ రైటర్లతో చర్చలు సాగి స్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముహూర్తం ఫిక్స్!
ఇటీవల ఆయన చెప్పిన 'పొలమ్మిన... పూలమ్మిన... సక్సెస్ అయిన డైలాగ్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేసిందో తెలిసిందే. తన డైలాగులతో యూత్కు బాగా కనెక్ట్ అవుతున్న మల్లారెడ్డి మూవీ ఇండస్ట్రీ విషయంలో సీరియస్ గా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఖాయమని అనౌన్స్ చేశారు. దీంతో డిసెంబర్లోనే ఆయన తన మూవీకి క్లాప్ కొట్టే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఈ క్రమంలో తన కాలేజీ ఫంక్షన్లకు సినీతారలను ఆహ్వానిస్తూ ఇండస్ట్రీకి చేరువయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే.. మల్లారెడ్డి మూవీ ఇండస్ట్రీలోకి ఏ రోల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరు. గుతున్న వేళ సొంత బ్యానర్ ఏర్పాటు చేసి తెలంగాణ యాసలో సినిమాలు తీయబోతున్నారనే ప్రచారం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ క్రమంలో తాను కూడా తెరపై కనిపించే అవకాశాలు లేక పోలేదనే చర్చ జరుగుతోంది.
0 కామెంట్‌లు