కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు నియంత్రణలో ఉంటాయని జగిత్యాల డి.ఎస్.పి కె వెంకటస్వామి పేర్కొన్నారు

 మంగళవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో మల్యాల సిఐ బిల్లా కోటేశ్వర్ పెగడపల్లి ఎస్సై సిహెచ్ సతీష్ నేతృత్వంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలోని పలు నివాసాలను తనిఖీ చేశారు అలాగే వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు పత్రాలు సరిగ్గా లేని 55 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను పట్టుకున్నారు డాగ్ స్క్వార్తోను తనిఖీలు నిర్వహించారు తనిఖీల అనంతరం స్థానిక గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన సమావేశంలో డిఎస్పి వెంకటస్వామి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఒక కెమెరా 100 మంది కాపలతో సమానమని గ్రామ ముఖ్య కూడళ్లతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థల వద్ద వాటిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని వివరించారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం సర్వనాశనం అవుతుందని తెలిపారు రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అలాగే అన్ని రకాల వాహన పత్రాలు కలిగి ఉండాలని డిఎస్పి స్పష్టం చేశారు అనంతరం పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను డిఎస్పి తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో మల్యాల జగిత్యాల రూరల్ సిఐలు జిల్లా కోటేశ్వర్ ఆరిఫ్ ఖాన్ పెగడపల్లి మల్యాల టు కొడిమెల జగిత్యాల రూరల్ బుగ్గారం ఎస్సైలు సిహెచ్ సతీష్ కుమారస్వామి వెంకట్రావు సుధాకర్ సందీప్ ఏఎస్ఐ సత్తయ్య గ్రామ సర్పంచ్ నేరెళ్ల హారిక గంగాధర్ ఎంపిటిసి సింగసాని విజయలక్ష్మి స్వామి ఉపసర్పంచ్ కోటగిరి గంగాధర్ నాయకులు డివిజన్ కు చెందిన 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు