ఏటీఎంలలో చోరీకి యత్నించిన నిందితుడి అరెస్ట్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు సీఐ ప్రవీణ్ కుమార్


జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన రెండు ఏటీఏం మిషన్లలో దోపిడికి యత్నించిన నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కోరుట్ల పోలీస్ స్టేషన్లో సీఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సదరు బ్యాంకు అధికారులు ఇచ్చిన పిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టగా, జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి తుర్క కాశినగర్ కు చెందిన సయ్యద్ వాజిద్ గా గుర్తించి, నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఏటీఎంలను పగలగొట్టి, అందులో ఉన్న సొత్తును దోపిడీకి ప్రయత్నించాడని, నిందితుడు వినియోగించిన ఇనుప చువ్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రజలందరూ సీసీ కెమెరాల ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్పై చిరంజీవి, ఇతర పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. సదరు బ్యాంకులు ఇచ్చిన ఫెర్యాదు మేరకు నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు