కృష్ణ మండలంలోని గుర్జల్ గ్రామంలో గ్రామ ప్రజలకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, CEIR నూతన అప్లికేషన్ గురించి, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి, అంటరానితనం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, షీ టీమ్స్, ట్రాఫిక్ చట్టాలు, సీసీ కెమెరాల పై కళాబృందం సభ్యులు మాటల ద్వారా పాటల రూపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు గ్రామాలలో దొంగతనాల నిర్మూలన గురించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఉండటం వల్ల దొంగతనాలు చేయడానికి భయపడతారని అలాగే గ్రామాలలో అసంఘటిత కార్యక్రమాలు నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని టు వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని, నిర్ణీత వేగంలో డ్రైవింగ్ చేయాలని, రాష్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరాల గురైనట్లయితే 1930 లేదా డయల్ 100 కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు గంజాయి, గుట్కా, డ్రగ్స్, మద్యపానం మొదలగునవి తీసుకోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది కావున ప్రజలంతా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సెల్ఫోన్ పోయిన దొంగతనానికి గురి అయినా వెంటనే ఆ సిమ్ కార్డ్ బ్లాక్ చేసుకొని, వేరే సిమ్ తీసుకున్న అనంతరం CEIR నూతన అప్లికేషన్లు సెల్ ఫోన్ కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని అలా చేయడం వల్ల పోయిన సెల్ ఫోన్ వెంటనే ఆచూకీ తెలుసుకోవడానికి వీలుంటుందని కావున ప్రజలు CEIR నూతన అప్లికేషన్ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలి సూచించారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు సురేందర్ గౌడ్, శేఖర్, లింగన్న, కళ్యాణి, రూక్య నాయక్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు