రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఠాణా ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. దేశంలోని 17 వేల పోలీస్‌స్టేషన్‌తో పోటీపడ్డ ఈ ఠాణా.. 2023 సంవత్సరానికి గాను ఈ ఘనతను సాధించింది.
పీర్జాదిగూడ: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఠాణా ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. దేశంలోని 17 వేల పోలీస్‌స్టేషన్‌తో పోటీపడ్డ ఈ ఠాణా.. 2023 సంవత్సరానికి గాను ఈ ఘనతను సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 76 పోలీస్‌స్టేషన్‌లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేయగా.. అందులో మేడిపల్లి ఠాణా ఒకటి. తెలంగాణ నుంచి మూడు పోలీస్‌స్టేషన్‌లకు ఈ ఘనత దక్కింది. ఆదివారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ముగ్గురు సభ్యుల బృందం ఈ పీఎ్‌సను సందర్శించి, పలు విషయాలపై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాలను అధ్యయనం చేసింది. స్టేషన్ పరిసర ప్రాంతాలు, నిర్వహణ, పరిపాలన విధానం, దర్యాప్తు తీరుతెన్నులు, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పూర్తిచేసి, కోర్టుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం, దొంగతనాల నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాలు, శాంతిభద్రతల నియంత్రణ, సిటిజన్ ఫీడ్‌బ్యాక్, భద్రత వంటి అంశాలకు స్కోరును కేటాయించి, ఉత్తమ ఠాణాలను ఎంపిక చేస్తారు. డయల్-100కు వచ్చే ఫిర్యాదులపై పోలీసులు/సిబ్బంది ప్రతిస్పందన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ బృందం వెంట మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్, ఏసీపీ నరేశ్‌రెడ్డి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ గోవర్ధనగిరి తదితరులున్నారు.
0 కామెంట్‌లు