అలరించిన మహిళా కవితోత్సవం


 ఒంగోలు కల్చరల్,: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఈ నెల 12వ తేదీ శనివారం నాడు విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వనితా వనం - కవితా సౌరభం శీర్షికన శతాధిక కవయిత్రుల స మ్మళనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే అసాధ్యం అన్నది లేదని, అయితే ప్రస్తుత సమాజ పరిణామాలను | దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తరాలను తీర్చిదిద్దటంలో వారి బాధ్యతను మరింత " సమర్ధవంతంగా నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ కవయిత్రులు డాక్టర్ కొలకలూరి ఆశాజ్యోతి (నల్లూరి రాజ్యలక్ష్మి స్మారక పురస్కారం), డాక్టర్ ఎస్.మస్తాన(జంగం రోశమ్మ స్మారక పురస్కారం ) మందరపు హైమావతి (వల్లభుని సీతాదేవి స్మారక పురస్కారం) కె.సుబ్బలక్ష్మమ్మ, చివుకుల శ్రీలక్ష్మి ను నరసం ప్రత్యేక పురస్కారాలతో సన్మానించారు . సభకు అధ్యక్షత వహించి అరుణ నరసం ఆశయాలను తెలియజేశారు.నరసం ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, కళామిత్రమండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు గారు సభా నిర్వహణ, వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఒంగోలుకు చెందిన చందూ డాన్స్ అకాడమీ చిన్నారులను నృత్యాలతో అలరించారు. అనంతరం కవయిత్రులను ఘనంగా సత్కరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు