ఐపీసీకి చెల్లుచీటీ సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టాలకు కూడా..

 


• వాటి స్థానంలో కొత్త క్రిమినల్ శాసనాలు!

రాజద్రోహ సెక్షన్ రద్దుకు ప్రతిపాదన • లోక్సభలో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం

• వలస పాలన నాటి గుర్తుల్ని అవి చెరిపేస్తాయన్న అమిత్

• మైనరుపై అత్యాచారానికి తెగబడితే ఉరే!

• మూకదాడి కేసుల్లోనూ మరణశిక్షకు అవకాశం

కొత్త బిల్లుల్లో పలు కీలక నిబంధనలు

స్థాయీసంఘానికి సిఫార్సు.. 

వలస పాలన తాలూకు గుర్తులను చెరి "పేస్తూ.. భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షా ముందడుగు పడింది. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్ పీసీ), సాక్ష్యాధార చట్టాల స్థానంలో నూతన శాసనాలను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధ మైంది! ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భార తీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్), భార తీయ నాగరిక్ సురక్షా సుహిత (బీఎన్ఎస్) -ఎస్), భారతీయ సాక్ష్యా (బీఎస్).. పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో

పాత చట్టం

భారత శిక్షాస్మృతి (1860) నేర శిక్షాస్మృతి (1898) భారత సాక్ష్యాధార చట్టం(1872)

శుక్రవారం ప్రవేశపెట్టారు. పౌరహక్కులను, పరిరక్షించడమే లక్ష్యంగా.. ప్రజల సమకాలీన అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వాటికి రూపకల్పన చేసినట్లు ఆయన ఉద్ఘాటించారు. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే ప్రతిఒక్కరికీ గరిష్ఠంగా మూడేళ్లలోనే న్యాయం జరుగుతుం దని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కొత్త బిల్లుల్లో కఠిన శిక్షలను ప్రతిపాదించారు. వీటిలో తొలిసారిగా ఉగ్రవాదాన్ని నిర్వచించారు. ఇటీ వలి కాలంలో చర్చోపచర్చలకు దారితీసిన రాజద్రోహ సెక్షన్ను రద్దు చేయనుండటం. వీటిలోని మరో ప్రధానాంశం. తదుపరి పరి శీలన కోసం ఈ మూడు బిల్లులను స్థాయీ సంఘానికి పంపారు. ...

లోక్సభలో శుక్రవారం మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఆంగ్లేయులు తమ పరిపాలనా వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా నాటి చట్టాలను రూపొందించారు. వాటి ఉద్దేశం- శిక్షించడమే తప్ప.. న్యాయం చేయడం కాదు, మేం వాటిని మార్చేస్తున్నాం. దండించడం కాకుండా.. న్యాయం చేయడమే మా ప్రధాన లక్ష్యం.

- అమిత్ షా

ఓటర్లను ప్రలోభపెడితే

ఎన్నికల్లో ఓటర్లను లంచంతో ప్రలోభపె ట్టినా, దొంగ ఓట్లు వేసినా ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధనను బీఎన్ఎస్ బిల్లులో చేర్చారు. డబ్బులు ఇస్తానన్నా, ఇవ్వజూపినా లంచం కిందే పరిగణిస్తారు. అభ్యర్థులు, ఓటర్లను బెది రించడాన్నీ నేరంగానే పరిగణిస్తారు. ఎన్ని. కల ఫలితాలను ప్రభావితం చేసేందుకు అభ్యర్ధులు చేసినట్లు తప్పుడు ప్రకటనలు చేసినా, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేసినా జరిమానా తప్పదు.

దాని స్థానంలో ప్రతిపాదించిన బిల్లు

భారతీయ న్యాయ సంహిత (2023)

ప్రమాదానికి కారణమై పారిపోతే.. పదేళ్ల శిక్ష

నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమై ఘట నాస్థలం నుంచి పారిపోతే పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేందుకు ఇకపై ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు- రోడ్డుప్రమాదా నికి కారణమై.. గాయపడిన బాధితులను పట్టించుకోకుండా, వారిని ఆసుపత్రుల్లో చేర్చకుండా, లేదంటే పోలీసులకు సమా చారం ఇవ్వకుండా పారిపోతే దాన్ని తీవ్ర మైన నేరంగా పరిగణిస్తారు. అప్పుడు 10 ఏళ్ల వరకు జైలు, జరిమానా పడటానికి ఆస్కారముంటుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు