తస్మాత్ జాగ్రత్త పింక్ వాట్సప్ అంటూ...


 తస్మాత్ జాగ్రత్త పింక్ వాట్సప్ అంటూ...

మీ ఫోన్ కి వచ్చే ఫార్వర్డ్ మెసేజ్ లను  నమ్మి మోసపోకండి ఆ లింక్ ని క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న  పూర్తి డాటా ఫొటోస్ , కాంటాక్ట్స్,బ్యాంకింగ్ డీటెయిల్స్ ఓటిపి, మొదలైనవి సైబర్ నేరగాల చేతిలోకి వెళ్లిపోతాయి.

 ...జిల్లా ఎస్పీ  ఎన్ వెంకటేశ్వర్లు 

    

 జిల్లా ఎన్ వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ.... సైబ‌ర్ నేర‌గాళ్లు నెటిజ‌న్ల‌ను మోసం చేసేందుకు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. మిలియన్ల మంది వినియోగదారులతో, దేశంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో WhatsApp ఒకటి. దాని జనాదరణ కారణంగా, సైబర్ మోసగాళ్ళు తమ మోసాన్ని వ్యాప్తి చేయడానికి దీన్ని సులభంగా ఉపయోగించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా “పింక్ వాట్సాప్” పేరుతో ఓ లింక్‌ను స‌ర్క్యూలేట్ చేస్తున్నారు. ఒక‌వేళ ఈ లింక్‌ను క్లిక్ చేస్తే.. మీ ఫోన్‌లో ఉన్న స‌మాచార‌మంతా సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంద‌ని ఒక‌వేళ మీరు ఇప్ప‌టికే ఈ లింక్‌ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఉంటే.. వెంట‌నే మీ ఫోన్‌ లో ఉన్న పింక్ వాట్సాప్' ని ఆన్ ఇంస్టాల్ చేసి మీ ఫోన్ ని  రిసెట్ చేసుకోండి. అదే విధంగా మీ బ్యాంకు ఖాతాల, సోష‌ల్ మీడియా అకౌంట్ల పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చుకోవాలల్సి ఉంటుంది.

'అసలు ఈ పింక్ వాట్సాప్' స్కామ్ అంటే ఏమిటి?

'న్యూ పింక్ లుక్ వాట్సాప్ అదనపు ఫీచర్లతో'- ఈ మెసేజ్ యూజర్ల ద్వారా సర్క్యులేట్ చేయబడుతోంది, ఇక్కడ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ వినియోగదారులను వారి మొబైల్‌ను హ్యాక్ చేయగల అదనపు ఫీచర్లతో ప్రలోభపెట్టడానికి ఈ లింక్ ని ఉపయోగిస్తారు.

సైబర్ నేరగాళ్ళు సైబర్‌క్రైమ్‌లకు పాల్పడేందుకు వారి వలలో పడేలా చేసేందుకు వివిధ రకాల కొత్త టెక్నిక్‌లతో వస్తారు. ఇటువంటి మోసాలు గురించి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సైబర్ నేరగాళ్ళు పంపే లింకులు, సందేశాల బారిన పడకుండా ఉండాలని అన్నారు.ఇది ఫిషింగ్ లింక్ అని దానిని క్లిక్ చేస్తే,  వినియోగదారుల ఫోన్‌పై దాడి చేసి వ్యక్తిగత డేటాను, మీ ఫోన్ లో ఉన్న ఫోటోస్, కాంటాక్ట్స్ మొదలైనవి  దొంగిలించవచ్చు లేదా రిమోట్ యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది. సైబర్ నేరగాళ్ళు మన సమాచారాన్ని వారి ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని కోల్పోవడం ద్వారా ఆర్థిక నష్టం, ఆధారాల దుర్వినియోగం అవుతుంది. 

మీరు ఇప్పటికే 'పింక్ వాట్సాప్'ని డౌన్‌లోడ్ చేసి ఉంటే?

అలాంటి యాప్ ఇప్పటికే డౌన్‌లోడ్ చేయబడి ఉంటే, వినియోగదారులు వెంటనే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని అదనంగా, అనధికారిక ప్లే స్టోర్‌ల నుండి ఏదైనా డౌన్‌లోడ్ చేయడం లేదా ఫిషింగ్ లింక్‌లపై క్లిక్ చేయడం వంటివి చేయకూడదు.  

'పింక్ వాట్సాప్' ని ఎలా తొలగించాలి?

వినియోగదారులు పింక్‌ వాట్సాప్ ని తమ హ్యాండ్‌సెట్ నుండి తీసివేయడానికి మీ ఫోన్ లో ఉన్న 'పింక్ వాట్సాప్'ని ఆన్ ఇన్‌స్టాల్  చేయాలి. ఈ స్కామ్ గురించి జిల్లా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సైబర్ నేరగాళ్ళు పన్నే నకిలీ పింక్ వాట్సాప్ వలలో పడవద్దని, ఒకవేళ అనుకోకుండా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ  తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు