పెదల భూముల కబ్జాలో సీఎం బంధువులే సూత్రధారులు
సీఎం ఫోటోతో వందల ఎకరాలు స్వాహా చేస్తున్న వైనం, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరు, -కల్వకుంట్ల రమ్యారావు ప్రతిజ్ఞ
పేదల భూముల కబ్జాలలో సీఎం బం ధువులే సూత్రధారులుగా వ్యవహరిస్తు న్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యరావు ఆరోపించారు. సీఎం ఫొటోతో ఎక రాల కు ఎకరాలు తమ ఆధీనంలోకి తీసుకుంటూ పేదల ను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హ్యాపీ హెూ మ్స్ సాగర్ ఇన్ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. 2001 ముందు గజం స్థలం లేని వ్యక్తులకు నేడు ఎకరాల కొద్దిభూములు, కోట్లాది రూపాయలు ఎలా వచ్చా యని ఆమె ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్ర గనగర్ మండలం, బద్వేల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 310,311,312 లలో గల స్థలాలను తక్కువ ఆదాయం పొందే కార్మికులు ఉద్యోగులు దాచుకున్న సొమ్ముతో కొనుగోలు చేశారని, సదరు స్థలాన్ని లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావు, ప్రవీణ్ రావు, ప్రవీణ్ రావు భార్య అనిత,శ్రీరామ్లు అడ్డదా రిలో తమ ఆధీనంలోకి తీసుకొని బాధితులను ఇబ్బందులకు గురి చేశార న్నారు. సుమారు 39 ఎకరాల 11 గుంటల స్థలా న్ని స్వాధీనం చేసుకున్న కబ్జాదారులు అందులోని
మసీదు, స్మశాన వాటికను సైతం నేలమట్టం చేసి బౌన్సర్లతో అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద లేని సెక్యూ కబ్జా చేసిన స్థలానికి ఉండటం ఏమిటని ప్రశ్ని ంచారు. స్థానిక ఎమ్మార్వోలు కబ్జా దారులకు సహకా "రిస్తుండగా హుడా, మునిసిపల్, రేరా, అధికారులు అక్రమ నిర్మాణాలకు అనుమ తు లు ఎలా ఇచ్చారని నిలదీశారు. ముఖ్యమంత్రి తమ బంధువే అంటూ చెలరేగిపోతున్న వారి పట్ల సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూబకాసురుల ఆగడాల నుంచి ప్రజల ను కాపాడేందుకు తక్షణమే సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించడంతోపాటు బాధితులకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రో జులలో ఈ అంశంపై స్పందించ కపోతే బాధితులు తో కలిసి కబ్జాకు గురైన స్థలంలోనే ఆమరణ నిరా హార దీక్ష చేపడతామని హెచ్చరిం చింది. ఈ కార్య క్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ హిదై తుల్లా షఫీ, ప్రధాన కార్యదర్శి హైమద్ సరఫరాజ్ సిద్ధికి, ఉపాధ్యక్షులు మేకల రవీందర్ రెడ్డి, పావని, మీర్జా దిల్వార్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
బుద్వేల్ భూములు కాజేసిన పెద్దలు
రాష్ట్ర ముఖ్య మంత్రి వెనకుండి కొందరు వందల ఎకరాలు కబ్జా. చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి రమ్యారావు (కేసీఆర్ అన్న కుమార్తె) ఆరోపిం చారు. బుద్వేల్లో పేదలు కొనుగోలు చేసిన భూములను లాక్కుని వారిని ఇబ్బంది పెడుతు న్నారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం సోమాజి గూడలోని ప్రెస్ క్లబ్లో రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లోని హాపీ హోమ్స్ సాగర్ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ వెనుక ఉన్న భూబ కాసురులు ఎవరని ప్రశ్నించారు. బుద్వేల్ భూముల కబ్జాను కేటీఆర్ ఆపినా, కబ్జాదారులు
బాధితులతో కలిసి పత్రాలు చూపుతున్న రమ్యారావు
ఆయన మాటలనూ బేఖాతరు చేసి ఆక్రమించు కుని విల్లాలు కడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇంటెలిజెన్స్ రిపోర్టునూ సీఎం దాకా చేరకుండా అడ్డుకోగలిగారంటే వారెంతటి పెద్దలో అర్థమవు తోందన్నారు. ముఖ్యమంత్రి దీనిపై విచారణ
కేసీఆర్ అన్న కుమార్తె, కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి రమ్యారావు ఆరోపణ
జరిపి 200 మంది పేదల ఇళ్ల స్థలాల్లో విల్లాల నిర్మాణం నిలిపివేసి యజమానులకు స్థలాలను అప్పగించాలని కోరారు. లేనిపక్షంలో గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. ఆ స్థలంలో మసీదు సైతం కూల్చివేస్తే అసదుద్దీన్ ఒవైసీ మౌనం దాల్చడంలో అంతర్యమేంటని ప్రశ్నిం చారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ స్థలంలోకి వెళితే ప్రగతి భవన్కు లేనంతగా బౌన్సర్లతో భద్రత ఉందని, తాను చూసేందుకు వెళితేనే కారును చుట్టుము ట్టారని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ హిదాయతుల్లా షఫీ, అహ్మద్ సర్ఫరాజ్ సిద్దిఖీ ఉన్నారు.
0 కామెంట్‌లు