*హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్*


 ఇటీవల అనారోగ్యంతో  మరణించిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ హెడ్  కానిస్టేబుల్ వి. వేంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/-  ఎనిమిది లక్షల రూపాయలు అదేవిధంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆర్ ఆనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు 7,87,820 రూపాయల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు ను గురువారం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా  పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ...

శాఖపరంగా  ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు.  పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో అక్తరూనీసాబేగం పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు