కరీంనగర్ బరిలో.. కల్వకుంట్ల రమ్యారావు!

 


కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం

 కరీంనగర్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి కల్వకుంట్ల రమ్యారావు రెడీ అవుతున్నారు. పార్టీలో తనకున్న ప్రాధాన్యత నేపథ్యంలో తప్పకుండా టికెట్ వస్తుందని బలంగా నమ్ముతున్నారు.  ఇప్పటికే పలువురు పీసీసీ నేతలతో ఆమె భేటీ అయి తన రెక్వెస్టును వారి ముందు ఉంచారు. ఒకవేళ కరీంనగర్ లోక్సభకు పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తే అసెంబ్లీ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ పొన్నం అసెంబ్లీకి పోటీచేయడానికి| సంసిద్ధమైతే ఎంపీగా బరిలో దిగేందుకు తాను రెడీగా ఉన్నట్లు వివరించారు.

అధికార పార్టీని ఓడిస్తా... ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కూతురిగా రమ్యారావు రాష్ట్ర ప్రజలకు సుపరిచితం. అయినప్పటికీ ఆమె కేసీఆర్ ఫ్యామిలీతో గానీ, బీఆర్ఎస్ పార్టీతో గానీ సంబంధాలు లేకుండా దూరంగానే ఉండిపో యారు. కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల రమ్యారావు మీడియా మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.. కరీంనగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తగా..

తానేంటో తెలుసని, పార్టీలో కూడా తన పాత్ర

ఏంటో లీడర్లకు తెలుసని తన మనసులోని

అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం

రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు

వీస్తుండడమే. కాకుండా కాంగ్రెస్ పట్ల ప్రజలు

|విశ్వాసంతో ఉన్నారని ఉదహరించారు. కరీంనగర్ నుంచి పోటీ చేస్తే తనకు ప్రజల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుందని, అధికార పార్టీని ఓడించే సత్తా కూడా ఉన్నదని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంతో భేటీ కాలేక పోయానని, పంద్రాగస్టు తర్వాత కలిసి తన అభి ప్రాయాన్ని తెలియజేస్తానని చెప్పారు. మరికొం నేతలను కూడా కలిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ నేతలతో భేటీ అవుతానని తెలిపారు. గతంలో ఎన్నడూ పార్టీ టికెట్ గురించి అగ్రనేతలపై ఒత్తిడి తీసుకురాలేదని.. ఈసారి మాత్రం అసెంబ్లీ లేదా లోక్సభకు పోటీ చేయాలని నిర్ణ నాని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు