*కొంగర జగ్గయ్య..కేరాఫ్.."మోరంపూడి".!!
విజయవాడ నుండి తెనాలికి పోయేదారిలో
సంజీవదేవ్ గారి ఊరు 'తుమ్మపూడి' దాట
గానే వచ్చే వూరు "మోరం పూడి"..అది సినీ
నటుడు కొంగర జగ్గయ్య గారి స్వగ్రామం.ఇది
చిన్నవూరే గానీ..జగ్గయ్య గారివల్ల ప్రసిద్ధి
చెందింది..బకింగ్ హామ్ కాలువకు..కుడి
పక్కన తుమ్మపూడి ..ఎడమ పక్కన….
మోరంపూడి..మధ్యలో బకింగ్ హామ్ కాలువ
అడ్డం వుంటుంది..అప్పుడెప్పుడో ఈ కాలువ దాటడానికి ప్రతీ ఊరు దగ్గర ఓ బల్లకట్టు
వుండేది(నా చిన్నతనంలో నేను చూశాను)
ఇప్పుడు కాల్వమీద ఎత్తుగా చిన్న సైజు
వంతెనలు కట్టారు.పాదచారులు,టూ వీలర్లు
దీనిగుండా రాకపోకలు సాగిస్తున్నారు…
ఇప్పుడు మోరంపూడి విషయానికొద్దాం…
జగ్గయ్య గారు ఈ వూరి నుంచే వచ్చాడు…
ఇప్పటికీ ఆయన ఇల్లు వుంది.చాలా కాలం
జగ్గయ్య కుటుంబీకులే వుండేవారు..ఇప్పుడు
గ్రామ సచివాలయానికి అద్దెకు ఇచ్చారు…
గ్రామసచివాలయం ఎక్కడంటే..? జగ్గయ్య
గారి ఇంట్లో అండి..అని అడ్రస్ చెబుతారు..
పాత కాలం నాటి ఇల్లే..అంత విశాలం కాకు
న్నా ..ఓ రకంగా పెద్దదే…ఆనాటి కాలంలో
గానుగ సున్నంతో ఈ ఇల్లుకట్టినట్టున్నారు..
ఎక్కడా చెక్కుచెదర్లేదు..పాత కాలంనాటి బర్మాకలప వాడినట్లున్నారు..పెద్ద పెద్ద తలు
పులు,కిటికీలు..దూలాలు ఒకటేమిటి…..
హెరిటేజ్ ఇల్లులా కన్నుల విందు చేస్తుంది..!
జగ్గయ్య (31 డిసెంబర్ 1926 - 5 ఆగస్టు 2004) రంగస్థల,చలనచిత్ర నటుడు, సాహి
త్యవేత్త,పాత్రికేయుడు, గేయ రచయిత, డబ్బింగ్ కళాకారుడు,కళావాచస్పతి,రాజ
కీయ నాయకుడు, అండ్ వాట్ నాట్…!!
11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడిపాత్రనువేశాడు.
బెంగాలీ రచయిత ..."ద్విజేంద్రలాల్ రాయ్"
రాసిన "సీత "అనే ఒక హిందీ నాటకంలో వేషం వేశాడు...విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రెసు పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరా
టంలో చురుగ్గా పాల్గొ న్నాడు. పాఠశాల చదు
వు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు.. తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు.
ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకుహాజరై పార్టీ తీర్మానాల
ను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు.!
*జర్నలిస్టుగా…!!
ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభి
మాని అనే పత్రికలో సబ్ ఎడిటర్ ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకుసంపాద
కుడిగానూ పని చేశాడు.
*చదువు…!!
గుంటూరు లోని ఎ సికళాశాలలోచేరాడు.ఇక్క
డే ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడింది. ఎన్.టి.రామారావు, కొంగరజగ్గయ్యసహవిద్యా
ర్థులుకావడంవిశేషం.
వీళ్ళిద్దరూ కలిసి ఎన్నోనాటకాలువేశారు. చిత్ర
కారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో
శిక్షణ పొందాడు. విజయవాడలోఅరుణోదయ,
నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాట
కాలు ఆడాడు.ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ను స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో
బహుమతులుగెలుచుకున్నారు. బుచ్చిబాబు వ్రాసిన 'దారిన పోయే దానయ్య' నాటిక వీరికి బాగా పేరు తెచ్చిపెట్టిం ది. ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్స
రాలపాటువార్తలు చదివే ఉద్యోగం చేసారు. అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి నాటకా
లు వేశారు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పని చేసే టప్పుడే ఢిల్లీ రాజ్య పతనం అనే నాటకం
లో జమునతో వేషంవేయించి తొలి సారినటిగా పరిచయంచేశారు జగ్గయ్య .
*కంచుకంఠం…!!
0 కామెంట్‌లు