జిల్లా వ్యాప్తంగా వివిధ ఏజెన్సీల, ట్రావెల్స్ పై ఏకకాలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

 


విదేశాల్లో ఉద్యోగాల కోసం వెల్లేవారు నకిలి ఏజెన్సీల ఆశ్రయించి మోసపోవద్దు.

 ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీల ద్వారానే సంప్రదించండి.

నకిలీ వీసాలు ఇచ్చి  విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే  PD ఆక్ట్  నమోదు చేస్తాం.

జిల్లా ఎస్పీ శ్రీ  ఎగ్గడి భాస్కర్ గారు

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా 15   ట్రావెల్స్, 36 ఏజెన్సీల పై ఏకకాలంలో ఆకస్మిక  తనిఖీలు నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వివిధ  ట్రావెల్స్ ఏజెన్సీలో ఉన్న 101 PASSPORT లను సీజ్ చేయడం జరిగిందని, 300 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది

విదేశాలలో  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే ఏజెన్సీలు, ట్రావెల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత ట్రావెల్స్, ఏజెన్సీ లను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని. నకిలి ఏజెంట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న  నేపధ్యంలో, ప్రభుత్వ గుర్తింపు వున్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. నిరుద్యోగ యువతి యువకులు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించే ముందు సంబందిత ఏజెంట్లకు అనుమతి ఉందా లేదా అని తెలుసుకోవాలని జిల్లా ఎస్పి గారు సూచించారు.

జగిత్యాల జిల్లా నుండి ఉపాధి నిమిత్తమై ఇతర దేశాలకు వెళ్ళు నిరుద్యోగులకు పోలీస్ శాఖ వారి సూచనలు.

1) జగిత్యాల జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు యువకులు లైసెన్స్ కలిగి ఉన్న  ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా పోలీస్ శాఖ సూచిస్తుంది.

2) ప్రభుత్వ లైసెన్స్ గల ఏజెన్సీల ద్వారా మాత్రమే వీసాను పొందవలెను.

3) ఇట్టి అభ్యర్థుల నుంచి లైసెన్స్ గల సంస్థలు పాస్ పోర్ట్ మరియు ఇతర ధ్రువీకరణ పత్రముల జిరాక్స్ కాపీలను మాత్రమే తీసుకోనును. లైసెన్స్ గల సంస్థ POE (Protector of Emigrants) ద్వారా విదేశీ కంపెనీలతో ఉద్యోగ ఒప్పందం కుదుర్చుకున్న పిమ్మట ఇట్టి సమాచారం అభ్యర్థులకు తెలియజేయబడును.

4) విదేశీ కంపెనీలు అభ్యర్థులకు ఇచ్చిన వీసా/ఆఫర్ లెటర్ నందు ఉద్యోగ లక్షణములు, జీతభత్యములు మొదలగు విషయములు పొందుపరచబడి ఉండును అభ్యర్థులు వాటిని జాగ్రత్తగా చదువుకోగలరు. 

5 ).అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులను ఏజెన్సీ వారికి ఇవ్వకూడదు

6) అభ్యర్థులు  వారి యొక్క పాస్పోర్ట్  ను అనాథరైజ్డ్ పర్సన్స్ కు ఇవ్వరాదు

7) అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో టూరిస్ట్ వీసా క్యాజువల్ వీసా లను ఆమోదించరాదు

8)ఎవరైనా అభ్యర్థులు ఏజెన్సీలచే మోసపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసు వారి సహాయం పొందగలరు.

ప్రభుత్వ ఆమోదిత పొందిన ఏజెన్సీస్ వారికి జిల్లా పోలీస్ శాఖ సూచనలు:

1.లైసెన్స్ ఏజెన్సీలో షరతులకు లోబడి మాత్రమే పనిచేయాలి.

2.వీసా లకు వచ్చే అభ్యర్థుల వద్ద నిర్దేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలి.

3.ఉద్యోగ వీసా గురించి వచ్చే వారికి విసిట్ మరియు టూరిస్ట్ వీసా  ఇవ్వకూడదు.

4.అభ్యర్థులను ఆకర్షించుటకు వాస్తవానికి మించి జీతభత్యాలను చూపించకూడదు.

5.లైసెన్స్ గల ఏజెన్సీలు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీల వివరాలు, జీతభత్యాలు మరియు ఇతర సమాచారాన్ని అభ్యర్థులకు సరిగ్గా తెలుపాలి. 

6.అభ్యర్థుల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో మెడికల్ టెస్ట్ మరియు ఫ్లైట్ టికెట్  వంటి ఇతర చార్జీలను తీసుకోరాదు.

7. ప్రభుత్వ లైసెన్స్ కలిగిన వారు తమ యొక్క ఏజెన్సీలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే నెలకొల్పాలి. 

పై నిబంధనలను అతిక్రమించి అభ్యర్థులను మోసం చేసే ఏజెన్సీల యొక్క లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు