రెండు గంటల్లో పట్టుకున్నాం: రాచకొండ సీపీ
చైన్ స్నాచింగ్ కేసులో ఓ బాధితురాలు ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో డయల్ 100కు ఫోన్ చేయగా.. రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
హైదరాబాద్: చైన్ స్నాచింగ్ కేసులో ఓ బాధితురాలు ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో డయల్ 100కు ఫోన్ చేయగా.. రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు.
‘‘వనస్థలిపురంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో చైన్ లాక్కొని వెళ్లారు. వెంటనే తేరుకున్న మహిళ ఐదు నిమిషాల్లో డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనల్లో నాక్కూడా సమాచారం ఇస్తారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి వాహన తనిఖీలు చేపట్టాం. ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. 8.21 గంటలకు బాధితురాలు ఫోన్ చేస్తే.. 10.31 గంటలకు నిందితులను పట్టుకుని, చైన్ స్వాధీనం చేసుకున్నాం.
బాధిత మహిళ సమయస్ఫూర్తిని అభినందిస్తున్నా. ఆమె పోలీసులపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తున్నాం. ఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా డయల్ 100కు ఫోన్ చేస్తే అంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు వీలుంటుంది. కొందరు ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే షాక్‌కు గురై సకాలంలో డయల్ 100కు ఫోన్ చేయడం లేదు. ఈలోగా నిందితులు తప్పించుకుంటున్నారు. ఇటీవల హయత్‌నగర్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో కూడా 8 గంటల్లో నిందితులను పట్టుకున్నాం. ఏదైనా ఘటన జరిగితే వెంటనే
0 కామెంట్‌లు