ఆషాడ మాసం ముగుస్తుంది అనంతరం లక్ష్మీప్రదమైన శ్రావణమాసం వస్తుంది ఈ సంవత్సరం లో రెండు శ్రావణమాసాలు రాబోతున్నాయి వాటిలో మొదటిది అధికమాసం ఇంతకీ "అధికమాసం" అంటే ఏమిటి ? అధిక శ్రావణమాసంలో శుభకార్యాలు చేయవచ్చా ? ఇలా ఎన్నో ప్రశ్నలు సహజంగానే ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్కకట్టే కాలమానాన్ని "సౌరమానం" అని, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని సంవత్సర గణాన్ని "చంద్రమాసం" అని అంటారు. చంద్రమాసంలో నెల అంటే 29, 53 రోజులు దీని ప్రకారం చంద్రమాసంలో ఏడాదికి 354 రోజులు, సౌర మాసంలో ఏడాదికి 365 రోజులు, అంటే పౌరమానానికి చంద్రమానానికి మధ్య ఏడాదిలో 11 రోజులు తేడా ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచెయ్యడానికి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దానినే "అధికమాసం" అని అంటారు.
అధికామాసంలో ఎం చేయాలి ?
అధికమాసంలో శుభకార్యాలను ఆచరించడం నిషిద్ధమని శాస్త్రాలు తెలియజేశాయి. దీని ప్రకారం వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితరాలను శుభకార్యాలు ఈవారం ఈ మాసంలో చేయకూడదు. పిత్రుకార్యా లను కూడా అధికమాసంలో కాకుండా నిజమాసంలోనే జరపాలి. కానీ అధికమాసానికి తనదైన విశిష్టత ఉన్నది. మహా విష్ణువుకు ఇది ప్రత్యేకమైన నెల దీనికి "పురుషోత్తమ మాసము" అనే పేరును ఆయనే ప్రసాదించాడని. ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అధికమాస మహిమ గురించి మహా విష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు "పురుషోత్తమ మాసంలో" ఎవరైతే పొందినది స్నానాలు, జప, హోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రేట్ల ఫలితాలు లభిస్తాయి. అధికమాసంలో పుణ్య కర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్ట, నష్టాలు ఎదురవుతాయి అని శాస్త్రాలు చెపుచున్నాయి.
ముఖ్య గమనిక: శ్రావణ ఉపవాసాలు, వ్రతాలు, ఆగస్టు 17 నుండి ఉపవాసాలు, వ్రతాలు చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
0 కామెంట్‌లు