విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయల పాత్ర ఎనలేనిదని కెపియం స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనాన్ అన్నారు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ అవరణలో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో
స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ...విద్యార్థులకుపాఠ్ యాంశాలను బోధించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారని, మన బలాలు, బలహీనతలను కనుగొనడంలో సహాయం చేస్తారన్నారు. అందుకే గురువుల సేవలను గౌరవించుకునేలా ఏటా
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా
సెప్టెంబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు.
గురువు ప్రతి ఒక్కరి జీవితంలో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులు పూయిస్తారని, విద్యార్థుల నైపుణ్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి విజయానికి సరైన మార్గాన్ని చూపిస్తారన్నారు. అలాంటి గురువుని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం, వారికి కృతజ్ఞతలు చెప్పడం మన కర్తవ్యమని అన్నారు. ప్రతి విద్యార్థికి పాఠశాల అనేది ఒక కుటుంబమని, గురువుల తల్లిదండ్రులతో సమానంగా భావించి ఆదర్శనీయులైన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిజేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఆర్ ఐ కామరాజు, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు
0 కామెంట్‌లు