తెలంగాణ ఉద్యమ
సూర్యుడు
మన పాటయై వస్తూనే
ఉంటాడు
ప్రజా యుద్ధ నౌక
గద్దరన్న కు
యావత్తు సమాజం
కన్నీటి సలాం
వేలాది పాటల ప్రవాహం
జన జాతరలో సాగుతోంది
కన్నీటి ప్రవాహమై
తెలంగాణ ఉద్యమంలో అగ్రసనాధిపత్యం వహించి ఉద్యమాన్ని అర్రుతలూగించున ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి
దేశ వ్యాప్తంగా శోక సంస్రం లో ముంచింది
వారి మరణం విప్లవ అభ్యుదయ
సాంప్రదాయ సాహితీ సమాజము తో పాటు తెలంగాణ
ప్రజా నికం శోక సంద్రంలో మునిగారు
తాడిత పీడిత ప్రజల కష్టాలు బాధలను వారి చమట చుక్కలను తమ పాటల్లో వస్తువుగా ఎంచుకొని వలస బతుకులను దారిద్రవ్యవస్థను నిద్రాణమైన ప్రభుత్వ పాలనను ఎండగట్టిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమయాత్ర నీ పాట నై వస్తున్నానమ్మా
నన్ను గన్న అమ్మలారా తల్లులారా అంటూ లక్షలాది మంది ఆస్రునయనాల మధ్య కొనసాగింది...
అంతులేని పాటలు
అంతం లేని పోరు బాట:---
తెలంగాణ సామాజికంగా సాంస్కృతికంగా అస్తిత్వపరంగా ప్రమాదంలో పడవద్దు అనే భావనతో తెలంగాణ ఉద్యమాన్ని తన పాట ద్వారా ప్రపంచానికి ఎరుక పరిచిన తెలంగాణ పాటను ఒక పిడుగుల వలె కురిపిస్తూ అభ్యుదయవాదం విప్లవ సాంప్రదాయం ప్రజల పండుగలు జానపద బాణీలలో వారి గుండెచప్పుడును
నిండైన బాణీలతో నిప్పులు కురిపించారు జంఝా మారుతమై శ్రావణ మేఘ గర్జన యై సమాజంలో నిద్రాణమైన వ్యవస్థను తట్టి లేపారు..
గద్దర్ గారి పాటల్లో సహజ సిద్ధమైన అభినివేశం దానితో పాటు నాటకీయత లాలిత్యం పులి వేట చురుకుదనం
జింక పరుగు వంటి పద సొంపు అపుడే బ్లాక్ బోర్డ్ పై వినసొంపు టీచర్ బోధన
వారి వాటా ప్రదర్శనలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి
వేలాది ప్రదర్శనలు కనికట్టు కట్టినట్లు కదలనియక వస్తువు వైవిద్యమును ఆలోచింపచేస్తాయి..
పొడుస్తున్న పొద్దు మీద
నడుస్తున్న
కాలమా...అనే పాట
ప్రపంచ సాహిత్య చరిత్రను తిరగరాసింది ఆ పాట తిరుగుబాటు తత్వానికి పోరాట తత్వానికి ప్రజల వేదనను ఆవేదనను మారుతున్న సమాజాన్ని మార్పు కోరుబోయే కొత్త దారిని అది ఎలుగెత్తి చూపింది తెలుగు భాషలో కాకుండా ఆ పాట ఇంగ్లీషులో కానీ మరే ఇతర భాషలో కానీ వచ్చినట్లయితే నోబెల్ బహుమతులు లాంటి అత్యుత్తమ శ్రేణి అవార్డును అందుకునేది అని సాహితీకారుల ఉవాచ
బండి యాదగిరి రాసిన బండెనుక బండి గట్టీ పదహారు బండ్లు గట్టి
అనే సుప్రసిద్ధ గేయం యావత్ తెలంగాణ సమాజాన్ని గద్దర్ నోటి వెంబడి నాలుగు దశాబ్దాలు ఉర్రుతలూగించింది
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాట సాధారణ పథపంక్తుల నుంచి అసాధారణ మైమరిపించే అన్నదమ్ములం అన్నాచెల్లెళ్ల బంధాన్ని విడదీయలేని మమతానురాగాల ప్రతీకగా పాటలకే ఒక పాట ఏయ్ నంది అవార్డు ప్రకటించిన అవార్డుల కంటే పాటే నా ప్రాణమని చాటి నంది అవార్డును తిరస్కరించిన గద్దర్ పాట ఆట అజరామరం
అదేవిధంగా ఎవరు నమ్మలేని స్థితిలో విశిష్ట అద్వైత మతస్థాపకులు సమతా మూర్తి మహా నీయస్ రామానుజ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సాహిత్యానికి ఏదైనా వస్తువే అనే భావజాలంతో 'రండిరో రండి రామానుజ జాతర పోదాం " అంటూ భక్తి సాహితీకారులను నివ్వరపోయే విధంగా గొప్ప పాటను తనదైన శైలిలో వినిపించారు
తూటా శరీరంలో
పాట ఆకాశమంత ఎత్తున:-----
1997లో గ్రీన్ టైగర్స్ పేరుతో గద్దర్ పై జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు ఆ పాశవిక చర్యకు గుర్తుగా అన్నట్లు ఆయన దేహంలో ఒక తూటా అలాగానే ఉండిపోయింది...
గద్దర్ పై దాడి జరిగిన అప్పట్లో సమాజం ఒక్కసారిగా స్పందించిన తీరు మహాద్భుతం నా శరీరంలో తూటా ఇంకా ఉన్న నా పాట ఆగదు ఆగదు అని వేదికల పైన ఎన్నో మార్లు ప్రకటించేవారు నిత్యము తూటా బాధలోనే మరో పాటకు మరో పాటకు ప్రాణం పోస్తూ వేలాది పాటలనుతన గొంతులో ఒలకబోస్తూనే
అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవితకనర్హుమనట్లు వారు ఎన్నో కవితా వస్తువులను తీసుకొని వాటిలో వాటిని ఓలలడించారు వాటి
నుంచి సర్వోత్కృష్టమైన పాటలకు ప్రాణం పోశారు
చీపురు కట్ట ఫ్యాను డ్రైవర్ చెత్త కుండి డాక్టర్ యాక్టర్ ప్రత్తి అంశాన్ని తన పాటలో బంధించి విప్లవ సాహిత్యానికి అభ్యుదయ సాహిత్యానికి సామాజిక సాహిత్యానికి బహుజన సాహిత్యానికి అంటే గేయ సాహిత్యానికి తనదైన ముద్ర వేశారు సుమారు 3000 పాటలను రచించారు ఎన్నో పాటలకు తనదైన బాణి ముద్రలో పాడి వినిపించారు వారి కలం గళం ఈ ప్రపంచం నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు గద్దర్ గారి భౌతిక శరీరం దూరమైన వారి సాహితీ సంపద సమాజంపై ఏదో రూపేనా ప్రస్ఫుటంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది
కె గోపాల్ జి
కవి రచయిత
0 కామెంట్‌లు