శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సేవలు అభినందనీయం..

 











*శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సేవలు అభినందనీయం..*

ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిష్నరేట్ నందు నూతనంగా ఎర్పాటు చేసిన 50 అడుగుల జాతీయ జెండాతో కూడిన హై మాస్ట్ ఫ్లాగ్ పోల్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.

జిల్లా పోలీస్ కమిషనరేట్ అవరణంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో National Informatics Centre DIO రూపొందించిన ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. 

అనంతరం ఇటీవలే మున్నేరు వరదల్లో ప్రమాద స్థాయిలో పని చేసి ప్రాణాలకు తెగించి పౌరులను కాపాడిన ఉత్తమ పోలీస్ సిబ్బంది(30 మంది)కి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. ఇది పోలీస్ కమిషనరేట్ భవనం మాత్రమే కాదని.. జిల్లా శాంతి భద్రతలకు చిహ్నం అని అన్నారు.
సుదూరం నుండి చూడగలిగే జాతీయ జెండా, భారతదేశపు ప్రతి పౌరుడిని గర్వపడేలా చేస్తుందన్నారు. 

ఒక నాడు ఇది కమాండ్ కంట్రోల్ భవనంగా ఉన్న దాన్ని నాడు ఎమ్మేల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు అరు పోలీస్ కమిషనరేట్ లుగా చేస్తూ బిల్లు పెట్టే క్రమంలో ఖమ్మం ను కూడా కమిషనరేట్ హోదా కల్పించాలని చేసిన విజ్ఞప్తి మెరకు సానుకూలంగా స్పందించి కేసీఅర్ గారు ఖమ్మంను కూడా కమిషనరేట్ బిల్లులో ఖమ్మంను చేర్చి 7వ పోలీస్ కమిషనరేట్ గా బిల్లులో పేట్టి ఆమోదించారని అన్నారు. 

ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదని పౌరులకు సామాజిక భద్రత కల్పించే భరోసా కేంద్రం అని  స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో అనేక సందర్భాల్లో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయం అని, జిల్లా వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ మంచి జీవన విధానంకు కృషి చేస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తునని చెప్పారు.

ముఖ్యంగా కోవిడ్ సమయాల్లో పోలీస్ సేవలు ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేరని కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేసిన సహాయక చర్యలు, భద్రత చర్యలు అభినందనీయం అన్నారు. 

మున్నేరు ముంపు ప్రాంతంలో నిర్విరామ సేవలు అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రతి ఒక్కరిని క్షేమంగా సురక్షిత స్థానాలకు తరలించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు..

ఇటీవలే చిమలపాడు గ్రామంలో జరిగిన ఘటనలో ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వ్యవస్థ పటిష్ట సేవలు అందించారని, దురదృష్టవశాత్తు నవీన్ అనే హెడ్ కానిస్టేబుల్ కాలు కోల్పోవడం బాధాకరమని, వారి ధైర్య సహసానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు.

విధి నిర్వహణలో భాగంగా నిత్యం అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో నిత్యం తన వెంటే ఉంటు ఎప్పటికప్పుడు పోలీస్ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

22 ఏళ్ళుగా ఇళ్ళ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇల్ల పట్టాలు ఇచ్చిన మంత్రి గారిని ఖమ్మం పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 

జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ V.P.గౌతమ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్,  ASC బోస్,
అదనపు డీసీపీ  కుమార స్వామి, ట్రైనీ ASP అవినాష్ కుమార్, ACP లు PV గణేష్, బస్వా రెడ్డి, రెహమాన్, రామానుజం, ప్రసన్న కుమార్, సారంగపాణీ, రవి, శివరామయ్య, సాంబరాజు, నర్సయ్య, CI లు సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు