ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కు కృత్రిమ కాలు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఈ ఏడాది ఏప్రియల్ 12 న జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ ఎడమ కాలు కోల్పోవడం జరిగింది. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ప్రత్యేక చోరవ తీసుకొని సాధ్యమైనంత సహజంగా కనిపించేలా కృత్రిమ కాలు కు శాఖ పరంగా అవసరమైన చర్యలు తీసుకొవాలని పోలీస్ అధికారులకు ఆదేశించడంతో నడవలేని స్థితిలో వున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కు జర్మనీ టెక్నాలజీతో ఒట్టోబాక్ కంపెనీ రూపొందించిన సుమారు తొమ్మిది లక్షల విలువ చేసే హైడ్రాలిక్ డ్యాంపర్ తో కూడిన కృత్రిక కాలు అమర్చేలా చర్యలు తీసుకొన్నారు. అదేవిధంగా ఒట్టోబాక్ కంపెనీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు హైదరాబాదులో శిక్షణ తీసుకొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారిని కలసిన నవీన్ మాట్లాడుతూ సకాలంలో ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడి చికిత్స అందించి, కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించి, కృత్రిమ కాలు ఏర్పాటుకు సహకారించిన పోలీస్ కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ ప్రసన్న కుమార్ , సిఐ చిట్టిబాబు, RI శ్రీశైలం పాల్గొన్నారు.
0 కామెంట్‌లు