77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కారించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయ ఆవరణలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్,హోంగార్డు,మినిస్ట్రీయల్ స్టాఫ్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .మన ఈ స్వేచ్చ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేస్తూ ..మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి జిల్లా పోలీస్ వ్యవస్తకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
*శ్రీకృష్ణప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో*
శ్రీకృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ చైర్ పర్సన్ హృదయ మెనాన్ జెండా ఆవిష్కరించారు. ఆనంతరం విద్యార్థులకు పోలీస్ కమిషనర్ స్వీట్లు పంచారు.
*పోలీస్ శిక్షణ కేంద్రం*
పోలీస్ శిక్షణ కేంద్రంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ జెండా ఆవిష్కరించారు.
*సిఏఆర్ హెడ్ క్వార్టర్స్*
సిటీ ఆర్మడ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్ లో ఏ ఆర్ ఏసీపీ నర్దయ్య, పాత సిపివో లో ఏసీపీ ప్రసన్న కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ గణేష్, ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి,CTC ఏసీపీ కృపాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్య పాల్గొన్నారు.
0 కామెంట్‌లు