భారతదేశంలోని టాప్ 10 సంపన్న యూట్యూబర్‌లు


 

యూట్యూబ్‌ ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యాబ్‌ను వీక్షిస్తున్నారు. భారతదేశంలోనూ కోట్ల మంది యూట్యూబ్‌ వీక్షకులు ఉన్నారు. ఇందుకు తగినట్లే యూట్యూబర్లు, యూట్యాబ్‌ ఛానళ్లు సైతం ఇటీవల పెద్ద సంఖ్యలో పెరిగాయి. 

యూజర్లు కంటెంట్‌ని వినియోగించే విధానంలో యూట్యాబ్‌ విప్లవాత్మక మార్పులు చేసింది. దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్ కొత్త తరం డిజిటల్ సెలబ్రిటీలకు జన్మనిచ్చింది. కామెడీ స్కెచ్‌ల నుంచి టెక్నికల్‌ రివ్యూల వరకు దేశంలోని ఈ టాప్ యూట్యూబర్‌లు దూసుకుపోతున్నారు. 

2008లో భారతదేశంలో యూట్యూబ్ అరంగేట్రం కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలకే పరిమితమైన యూట్యూబ్‌ అనతి కాలంలోనే దేశంలోని యూట్యూబర్‌లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అతిపెద్ద వేదికగా మారింది. వర్ధమాన చిత్రనిర్మాతల నుంచి గృహిణుల వరకు యూట్యూబ్‌ కోట్లాది మంది గొంతుగా మారింది. 2023లో దాదాపు 467 మిలియన్ల మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లను దేశంగా భారత్ నిలిచింది.

దేశంలోని టాప్ 10 యూట్యూబర్‌లు
భారతదేశంలో డిజిటల్ సూపర్‌స్టార్లు ఈ టాప్ 10 యూట్యూబర్‌లు.  యూట్యూబ్‌లో యూజర్లను పెంచుకోవడం మామూలు విషయం కాదు. యూట్యూబ్‌ అల్గారిథంను అవపోసన పట్టి యూజర్ల నాడిని తెలుసుకుని అందుకు తగిన కంటెంట్‌ను క్రియేట్‌ చేసే వాళ్లే ఇక్కడ టాప్‌లో నిలుస్తారు. అలా యూజర్లపరంగా టాప్‌ 10లో ఉన్న యూట్యాబర్లు, వారి చానళ్లు, ఏ రకమైన కంటెంట్‌ అందిస్తున్నారో తెలుసుకుందాం..

  • క్యారీమినాటి, 39.9 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, రోస్టింగ్, కామెడీ కంటెంట్‌
  • టోటల్‌ గేమింగ్, 35.7 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్‌
  • టెక్నో గేమర్స్‌, 34.9 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్‌
  • మిస్టర్ ఇండియన్ హ్యాకర్, 32.1 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, లైఫ్ హ్యాక్స్, ప్రయోగాలు
  • రౌండ్2హెల్, 30.9 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, కామెడీ స్కిట్‌లు
  • ఆశిష్ చంచలానీ, 29.8 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, కామెడీ స్కిట్‌లు, వ్లాగ్‌లు
  • సందీప్ మహేశ్వరి, 27.9 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, మోటివేషనల్‌ స్పీకింగ్‌
  • బీబీకి వైన్స్, 26.3 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, కామెడీ, వినోదం
  • అమిత్ భదానా, 24.3 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, కామెడీ, వినోదం
  • టెక్నికల్‌ గురూజీ, 23.1 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు, టెక్నాలజీ రివ్యూస్‌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు