జులై 25వ తారీఖు ఉదయం 10:35 నా ఆపిల్ వాచ్ నుంచి హై హార్ట్ రేట్ ఎవర్ట్ 148 బీట్స్ పర్ మినిట్ తర్వాత వెంటవెంటనే 155,167,169,149 అలా 125 కి తగ్గకుండా తర్వాత రోజు తెల్లవారుజాము వరకు వస్తూనే ఉన్నాయి నోటిఫికేషన్లు..
ఆపిల్ వాచ్ చాలా మందిని కాపాడింది అని చాలా విన్నాను అవగాహన కూడా ఉంది కానీ ఆరోజు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.లోలోపల కొంత టెన్షన్ మాత్రం ఉంది..
తర్వాత ఒక పూట గ్యాప్.. తర్వాత కొంత ఫీవర్ వచ్చింది..షరా మామూలే డోలో 650 టాబ్లెట్ వేసుకున్నా.. తర్వాత ఒక గంటకి ఫీవర్ అనేది తగ్గింది కానీ మళ్ళీ హైహార్ట్ రేట్ నోటిఫికేషన్స్ రావడం మొదలయ్యాయి.
ఫీవర్ కూడా మళ్ళీ రావడం జరిగింది దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏదో రెండు ఇంజెక్షన్లు చేసుకోవడం అలాగే అతను ఇచ్చిన యాంటీబయాటిక్ టాబ్లెట్స్ మరియూ డోలో 650 వేసుకోవడం జరిగింది.
తర్వాత నెమ్మదిగా ఆకలి తగ్గడం నోరు చేదుగా మారడం జ్వరం తగ్గకపోవడం లాంటి లక్షణాలు రావడం గమనించాను.
మళ్లీ ఆర్ఎంపి దగ్గరికి వెళ్లి మరో రెండు ఇంజెక్షన్లు చేసుకొని తగ్గుతుందని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాను అలా జూలై 29వ తారీకు వచ్చేసింది.
జ్వరం తగ్గలేదు పైగా నీరసం ఎక్కువ అయ్యి వాంతులు కూడా మొదలయ్యాయి..
ఇక లాభం లేదు అనుకొని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి తను సజెస్ట్ చేసిన హెల్త్ టెస్టులు చేపించాను...
షాక్......
దాదాపుగా లాస్ట్ స్టేజిలో ఉన్న డెంగ్యూ ఫీవర్ మరియూ రక్తంలో ప్లేట్లేట్స్ కౌంట్ 12000 పడిపోయాయి..
వెంటనే వరంగల్ లో ఉన్న అజరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది..తెలిసిన ఫ్రెండ్స్ అత్యంత సన్నిహితులు ఒకరు ఒక ప్యాకెట్ ఏ పాజిటివ్ ప్లాస్మా ఇచ్చారు.మిగిలిన ఇద్దరు మిత్రులు ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్ మూడు ప్యాకెట్స్ ఇచ్చారు..వారి రుణం జన్మలో తీర్చుకోలేనిది..I
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి నిన్ననే ఇంటికి వచ్చాను..
హాస్పిటల్ లో "బండారు శివ సుబ్రహ్మణ్యం" డాక్టర్ గారు మరియూ వారి టీం ప్రత్యేకంగా నాపైన చూపించిన శ్రద్ధ అసలు మాటల్లో చెప్పలేనిది..వారి దయవల్లే బతికి బయటపడ్డాను..
ఈ దెబ్బతో నేర్చుకున్న పాఠాలు..
1 : ఆపిల్ డివైజెస్ అంటే విపరీతమైన పిచ్చి ఉండి అన్నీ లేటెస్ట్ డివైజెస్ వాడుతూ కూడా ఆపిల్ వాచీలో వచ్చిన హై హార్ట్ రేట్ నోటిఫికేషన్లు పట్టించుకోకపోవడం
2 : ఒకసారి జ్వరం తగ్గకపోతే మరొక సారి కూడా ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం
3 : జ్వరం వస్తే డోలో వేసుకుంటే తగ్గిపోతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్
4 : బొప్పాయి పండు జీవితంలో చాలా ముఖ్యం అని తెలిసి కూడా తినకపోవడం
0 కామెంట్‌లు